ఆమె యస్‌ చెప్పింది : రానా

టాలీవుడ్‌లో మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌గా ఉన్న రానా తన ప్రేమ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. మిహీక బజాజ్‌ అనే యువతితో తను ప్రేమలో ఉన్నానని రానా సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. ఆమెతో కలిసి దిగిన ఫొటోను పోస్ట్‌ చేసిన రానా.. ఆమె యస్‌ చెప్పిందని పేర్కొన్నారు. దీంతో సినీ ప్రముఖలతో పాటుగా, అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.  సమంత, ఉపాసన, తమన్నా, నిఖిల్‌, అల్లు శిరీష్‌, నిహారిక, సుషాంత్‌, రాశి ఖన్నా, శృతిహాసన్‌.. ఇలా పలువురు సినీ ప్రముఖులు ఇన్‌స్టా వేదికగా రానాకు శుభాకంక్షలు తెలిపారు. క్వారంటైన్‌ టైమ్‌లో గుడ్‌ న్యూస్‌ చెప్పాడని కొందరు.. ఓ మై గాడ్‌ అని మరికొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.
Rana Daggubati Announces His Love Miheeka Bajaj - Sakshi
ఇక, మిహీక విషయానికి వస్తే తను హైదరాబాద్‌లో పుట్టి పెరిగారు. ప్రస్తుతం ఆమె ఓ ఈవెంట్‌ మెనేజ్‌మెంట్‌ కంపెనీ నిర్వహిస్తున్నారు. లండన్‌ చెల్సియా యూనివర్సిటీలో ఆర్ట్స్‌ అండ్‌ డిజైన్‌ విభాగంలో ఎమ్‌.ఏ పూర్తి చేశారు. మిహీక తల్లి జ్యూవెల్లరీ డిజైనింగ్‌ రంగంలో ఉన్నారు. కాగా, మిహీక వెంకటేశ్‌ కుమార్తె ఆశ్రితకు మంచి స్నేహితురాలని సమాచారం. గతంలో రానా పలువురితో ప్రేమలో ఉన్నట్టుగా వార్తలు వచ్చినప్పటికీ.. అవన్నీ వదంతులుగానే మిగిలిపోయాయి. తాజాగా రానా చేసిన ప్రకటనతో దగ్గుబాటి అభిమానులు సంబరపడిపోతున్నారు

Post a Comment

0 Comments